नीरजा चिन्मय विवाहावसरे साशीर्कं प्रस्तुतः

आशीः पद्योपहारः

(मन्दाक्रान्त वृत्तम्)

दर्शं दर्शं हरिगुरुपदं मोदितस्वान्तरङ्गाः

वाचं वाचं शुभकरमितो भावुकं युष्मदीयम्।

स्मारं स्मारं परिणयमिमं नीरजा चिन्मयीयं

गोपायध्वं विमलमनसो बन्धवो जास्पती ते।।

शाण्डिल्योयं वरगुणखनिर् बह्वृचाधीतिमत्ता-

भाग्योपेतो गुरुकरुणभाक् चिन्मयो वृद्धिमेतु।

गार्हस्थ्योक्तं श्रुतिसुविहितं कर्मजातं प्रकुर्वन्

आनन्दाना.मनिश.मशिता नीरजाजानि.रस्तु।।

धर्मार्थाभ्या-मविरहिततां राय.मिष्टां विधन्तौ

अन्तस्सख्यौ सकलरमणौ नीरजा.चिन्मयौ तौ।

वेदप्रोक्तां शुभपरिणता-माप्नुवातां महत्ताम्

विद्यां पूर्वान्वयपरिगतां सच्चिदानन्दहेतुम्।।

वंशीकृष्ण घनपाठी सदस्याः - वेदविज्ञानविष्टरम् 06-12-19

నీరజా చిన్మయ వివాహావసరే సాశీర్కం ప్రస్తుతః

ఆశీః పద్యోపహారః

(మన్దాక్రాన్త వృత్తమ్)

దర్శం దర్శం హరిగురుపదం మోదితస్వాన్తరఙ్గాః

వాచం వాచం శుభకరమితో భావుకం యుష్మదీయమ్.

స్మారం స్మారం పరిణయమిమం నీరజా చిన్మయీయం

గోపాయధ్వం విమలమనసో బన్ధవో జాస్పతీ తే..

శాణ్డిల్యోయం వరగుణఖనిర్ బహ్వృచాధీతిమత్తా-

భాగ్యోపేతో గురుకరుణభాక్ చిన్మయో వృద్ధిమేతు.

గార్హస్థ్యోక్తం శ్రుతిసువిహితం కర్మజాతం ప్రకుర్వన్

ఆనన్దానా.మనిశ.మశితా నీరజాజాని.రస్తు..

ధర్మార్థాభ్యా-మవిరహితతాం రాయ.మిష్టాం విధన్తౌ

అన్తస్సఖ్యౌ సకలరమణౌ నీరజా.చిన్మయౌ తౌ.

వేదప్రోక్తాం శుభపరిణతా-మాప్నువాతాం మహత్తామ్

విద్యాం పూర్వాన్వయపరిగతాం సచ్చిదానన్దహేతుమ్..

వంశీకృష్ణ ఘనపాఠీ సదస్యాః - వేదవిజ్ఞానవిష్టరమ్ 06-12-19

చిరంజీవి నీరజా చిన్మయదత్త ఘనపాఠీవివాహ సందర్భముగా ఆశీస్సులతో ప్రదత్తమైన

ఆశీర్వచన పద్యముల బహుమతి

మందాక్రాంత వృత్తము

1) చక్కని మనసులుగల బంధుమిత్రురాలా - వేంకటేశ్వరుడి సన్నిధిలో గురుదేవులను చూస్తున్నారు. చూస్తూ చూస్తూ ఆనందించి, మీయొక్క శుభమైన ఆశీర్వచనములను పలుకుతూ, నీరజా చిన్మయుల వివాహాన్ని ఆనందంగా తలచుకుంటూ, ఈ దంపతులను మీ ప్రార్థనలతో క్షేమంగా చూసుకోండి.

2) ఈ కుర్రవాడు శాండిల్య గోత్రోద్భవుడు. ఆ శాండిల్య మహర్షి గొప్ప వేదవేత్త, బ్రహ్మవిద్యా నిష్ఠుడు. అటువంటి గొప్ప గోత్రమునకు అనుగుణమైన గొప్ప (వరుడి) గుణములను గలిగి, ఋక్కులయొక్క అధ్యయనభాగ్యమును పొందిన ఈ చిన్మయ దత్త గురువుల గొప్ప అనుగ్రహమువల్ల వృద్ధి చెందుగాక. అంతేగాక, నీరజయొక్క భర్తగా ఇతడు, గృహస్థాశ్రమములో చేయవలసిన వేదవిహితమైన కర్మలను సపత్నీకముగా ఆచరిస్తూ, ఉపనిషత్తులలో చెప్పిన (మానుషానందము మొదలైన) ఆనందములన్నిటినీ అనుభవించుగాక.

3) ధర్మమును అర్థమునూ కోల్పోకుండా, ఇష్టమైన సంపదను సాధించవలసిన ఈ నీరజా - చిన్మయులు, ఆంతరంగికమైన స్నేహముతో, అందరినీ మెప్పిస్తూ వేదములచే చెప్పబడిన శుభపరిణామములతో కూడిన గొప్పదనమునూ, పూర్వజులనుండి వంశానుగతమైన విద్యను అనగా సచ్చిదానందమునకు హేతువైన బ్రహ్మవిద్యను కూడ పొందాలనే మంగళాశాసనములు.

మంగళం మహత్